Published on 16 Oct 2025
సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన **స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)**ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల శాతం పెంపు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పులో ఎటువంటి లోపం లేదని వ్యాఖ్యానిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరంగా పెద్ద దెబ్బ తగిలినట్టైంది. బీసీ రిజర్వేషన్ల పెంపు ప్రయత్నం ఇంతటితో నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది.
న్యాయ వర్గాల ప్రకారం, సుప్రీంకోర్టు నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల అమలులో కొత్త వ్యూహాన్ని రూపొందించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో విచారణ వాడీ వేడిగా సాగాయి. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహత ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్‌పై అభిషేక్ మను సంఘ్వీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని సింఘ్వి ధర్మాసనానికి వెల్లడించారు. రిజర్వేషన్ల గరిష్ట పరిమితి 50% మించకూడదు అన్నది ఒక తప్పుడు అభిప్రాయమని, ఇందిరా సహానీ కేసు సహా మరికొన్ని తీర్పుల్లో.. సమగ్ర డేటా ఉంటే.. దాని ఆధారంగా రిజర్వేషన్లు కల్పించవచ్చని చెప్పాయని గుర్తు చేశారు.
భారత దేశంలో ఏ రాష్ట్రం ఇలాంటి సర్వే ఎక్కడ నిర్వహించలేదని, ఎక్స్పర్ట్ కమిటీ సర్వేను మొత్తం ఎనలైజ్ చేసిందని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న అన్ని పార్టీ నాయకులు ఏకగ్రీవంగా ఆమోదించారన్నారు. గవర్నర్ 3 నెలలు గడిచినా బిల్లుపై ఎలాంటి చర్య చేపట్టలేదని, సుప్రీంతీర్పు ప్రకారం 3 నెలల్లో బిల్లును ఆమోదించకపోతే.. ఆటోమేటిగ్గా ఆమోదం పొందినట్లేనని సింఘ్వీ తెలిపారు.