Published on 15 Oct 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థికి ఊహించని షాక్ తగిలింది. కారు పార్టీ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కుమార్తె అక్షరలపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. వెంకటగిరిలోని ప్రార్థన మందిరం వద్ద అనుమతి లేకుండా ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు చేశారు. వీరితో పాటు మరి కొందరు బీఆర్ఎస్ నాయకులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను వారిపై కేసు నమోదు చేశారు. మాగంటి సునీత, ఆమె కుమార్తె ఇద్దరూ.. వెంకటగిరిలోని ఓ ప్రార్థన మందిరం వద్ద అనుమతులు తీసుకోకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారి చర్యలతో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనలో మాగంటి సునీత, ఆమె కుమార్తెలతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్‌తో పాటు మరో నలుగురి బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. వీరందరి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ లీడర్లు అంజద్ అలీఖాన్, ఆజం అలీ, షఫీ, ఫయీం వంటి వాళ్లు.. వెంకటగిరిలోని ఓ ప్రార్థన మందిరం వద్ద బీఆర్ఎస్ పార్టీ కండువాలు ధరించి చేతిలో కరపత్రాలతో కనిపించారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది.
ని గురించి సమాచారం అందిన వెంటనే.. ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ డిప్యూటీ తహసీల్దార్ ఫ్రాన్సిస్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈసమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కుమార్తె, ఇతర బీఆర్ఎస్ నాయకులు.. చేతిలో కార్డులు పట్టుకుని, ప్రార్థనలు చేసుకుని వస్తున్న వారిని.. తమ మాటలతో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు గుర్తించారు. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి పూర్తిగా విరుద్ధమని, మతపరమైన ప్రదేశాలలో రాజకీయ ప్రచారాలు చేయకూడదని ఫ్రాన్సిస్ స్పష్టం చేశారు. వీరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీని ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మసీదు వద్దకు వెళ్లి ప్రచారం చేసినందుకు గానుమాగంటి సునీతను A1గా, ఆమె కూతురు మాగంటి అక్షరను A2గా, మరికొంతమందిని చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని వారిపై ఆరోపణలు ఉన్నాయి.